KMM: కలెక్టరేట్లో ఎరువుల ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఎరువులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు ఉన్న టోల్ ఫ్రీ నెం.1077, సెల్ నెం. 9063211298 లకు కాల్ చేసి, ఫిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లాలో కావాల్సినంత ఎరువులు అందుబాటులో ఉన్నట్లు, ఎక్కడా ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు.