ATP: గుత్తిలోని ఫుట్బాల్ మైదానంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో ఇవాళ బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబుబకర్, అదనపు కార్య దర్శి కుళ్లాయి బాబు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో దేశానికి వారు ఎన్నో సేవలందించారని కొనియాడారు.