అన్నమయ్య: జిల్లాలో హెల్మెట్ అవగాహన ర్యాలీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం నిర్వహించారు. అందులో భాగంగా ట్రాఫిక్ డ్యూటీలు,పెట్రోలింగ్, మహిళల భద్రత కోసం 16 నూతన ద్విచక్ర వాహనాలను ఆయన ప్రారంభించారు. నూతన వాహనాల్లో బుల్లెట్, అపాచీ బైక్స్,సైరన్, పబ్లిక్ అడ్రసింగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందులో ఉన్నాయి. అనంతరం ‘హెల్మెట్ బరువు కాదు, బాధ్యత’ అంటూ ప్రజలకు పలు సూచనలు అందజేశారు.