KMM: జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్లల్లో నాణ్యమైన ఆహారం అందేలా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలో వివిధ సంక్షేమ శాఖలచే 122 రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సుమారు 13 వేల 876 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉచిత విద్యతో పాటు వసతి పొందుతున్నారని వెల్లడించారు. అటు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు.