GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్తో సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.