సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటి కుళాయిల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు కృషితో రూ.19 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 250 బోర్లు వేయించగా, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం ప్రారంభమైంది. ప్రతి ఇంటికి మంచినీరు చేరాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారని తెలిపారు.