TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘రామచందర్ రావు వాదన వింతగా ఉంది. మీరు ఇచ్చిన హామీని మీరే అమలు చేసుకోవాలంటున్నారు. కాంగ్రెస్కు ఓ రాజ్యాంగం, బీజేపీకి ఓ రాజ్యాంగం ఉండదు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.