MBNR: మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ప్రవహిస్తున్న దుందుభి వాగును జిల్లా ఎస్పీ జానకి ధరావత్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. చిన్నారులు వృద్ధులు మహిళలు వాగు ప్రవాహానికి దూరంగా ఉండాలని కోరారు.