ADB: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉట్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ గ్రామంలో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సలాది భీమన్నకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బిరుదుల లాజర్ కొల్లూరి స్వామి, జాదవ్ రాజేష్, ఎ.సుశీల్ కుమార్ ఉన్నారు.