TG: వందేళ్లుగా వాయిదా పడ్డ కులగణనను నెల రోజుల్లో పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి పార్లమెంట్‌కు పంపాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు.. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపాం. కానీ, కేంద్రం జాప్యం చేస్తోంది. రేపు రాహుల్, ఖర్గేను కలిసి కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తాం’ అని చెప్పారు.