GNTR: తెనాలికి చెందిన సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 27న రఫీ సాబ్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తమరావు ఈ విషయాన్ని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుందని బుధవారం నిర్వహుకులు ఒక ప్రకటనలో తెలిపారు.