GNTR: తెనాలి నుంచి ఈమని వెళ్లే మార్గంలో బుధవారం మధ్యాహ్నం దుగ్గిరాల వద్ద ఓ ఆటో బోల్తా పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్, ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. తోటి వాహనదారుల సహాయంతో ఆటోను లేపి ప్రయాణికులను మరో వాహనంలో తరలించామని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.