GDWL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజోలి మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని అధికారులు తనిఖీ చేశారు. సోమవారం తహశీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో అబ్దుల్ ఖాన్, ఎంపీఓ బాలరాజు, కార్య దర్శి కృష్ణయ్య వసతిగృహంలోని భోజన సదుపాయాలు, పరిశుభ్రతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.