మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి వెంకటయ్య స్పష్టం చేశారు. ఇటీవల ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు పాపన్నపేట, కొల్చారం మండలంలో ఉన్న పౌల్ట్రీ షెడ్లను పరిశీలించారు. కొక్కెర వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎండ తీవ్రతతో కోళ్లు మరణిస్తే నిర్వాహకులు వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.