సూర్యాపేట: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల ఓరియంటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 69 కేంద్రాల్లో 12,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు.