ADB: జీవో నెంబర్ 7ని తీసుకువచ్చి ప్రైవేట్ విద్య సంస్థల్లో స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయటం సరైన నిర్ణయం కాదని భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షకీల్ అన్నారు. మంగళవారం పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరమవుతారని పేర్కొన్నారు.