MBNR: విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, లక్ష్య సాధన కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన 12 రోజుల వేసవి శిక్షణా శిబిరం ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోన్లకు బానిసలైతే సృజనాత్మకత దెబ్బతింటుందని అన్నారు.