NZB: ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. మొత్తం 180 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్లాగ్, 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు.