SRPT: మహిళా పోలీసులు ధైర్యంగా, గర్వంగా పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోష్ యాక్ట్-2013 చట్టంపై మహిళ పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. సమస్యలు ఉంటే పెద్దన్నగా అండగా ఉంటానని, పని ప్రదేశంలో వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు.