BHNG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.