NGKL: సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలు ఇందిరమ్మ ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.