SRD: శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నాల్గవ రోజు స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులు భారీగా పాల్గొని భక్తి పాటలతో ఊరేగింపును నిర్వహించారు. 5 రోజుల ఉత్సవాలు రేపటితో ముగియనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఊరేగింపుకు భక్తులు భారీగా తరలి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.