ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈవోగా రవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. శాఖ కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.