KMM: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన భూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలం మంగళగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.