BHNG: రామన్నపేట మండలం బోగారంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు కునూరు సాయికుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బత్తుల ఉమా రమేశ్ తదితరులు ఉన్నారు.