ADB: చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని బోథ్ సీఐ గురుస్వామి శుక్రవారం తెలిపారు. బ్లాక్మెయిలింగ్ పాల్పడి, రూ. 5200 డబ్బులు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టులు తూము సూర్యం, మల్లెపూల గంగన్నపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. బాధితుడు షేక్ అలీ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.