TG: బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టిందే BRS అని మాజీ మంత్రి హరీష్ రావు ఉద్ఘాటించారు. తాము బల్లెం పెట్టి పొడిస్తే గానీ ప్రభుత్వం మొద్దునిద్ర లేవలేదని విమర్శించారు. బనకచర్ల మీటింగ్కు పోలేదని CM రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని.. తాము ఆ అజెండాను బట్టలిప్పి.. బట్టబయలు చేశామని అన్నారు. మళ్లీ తాజాగా కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం తెలంగాణకు చేస్తున్న ద్రోహమేనని పేర్కొన్నారు.