CTR: ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవిని పథకం పేదలకు వరమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ సుధారాణి సూచించారు. వీకోట మండలం ఓగు పీహెచ్సీలో శుక్రవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో త్వరలోనే సంజీవిని పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. రోగుల వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో భద్రపరుస్తామన్నారు.