E.G: నేడు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మార్లమూడి, ప్రకాశరావుపాలెం గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రెవెన్యూ సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కార్యకర్తలకు సర్టిఫికేట్ పంపిణీ, ప్రకాశరావుపాలెంలో సాయింత్రం 5 గంటలకు CMRF చెక్కుల పంపిణీకి హాజరవుతారని పార్టీ కార్యాలయం తెలిపింది.