TG: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఇవాళ్టి నుంచి ‘ఉద్యాన ఉత్సవ్’ ప్రారంభంకానుంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 50కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో రైతులకు కొత్త సాగు విధానాలు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తారు. అలాగే రసాయనాల్లేని ఆహారం, కిచెన్(వంట ఇల్లు), టెర్రస్ గార్డెనింగ్పై నగర వాసులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు.