MDK: శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుల్లెబోయిన మౌనిక (28), ప్రియుడు సంపత్ (23)తో కలిసి భర్త స్వామి (35)ను హత్య చేయగా అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వివాహేతర సంబంధంపై గొడవ జరగగా గత నెల 22న మద్యం మత్తులో ఉన్న స్వామిని ఇరువురు కలిసి హత్య చేసినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి వీరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.