SRPT: మోతే మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎస్సై అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.