AP: తిరుపతిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి గోవిందరాజస్వామి ఆలయం గోపురం ఎక్కి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో మహాద్వారం లోపలకు ప్రవేశించి గోపురం మీద కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. మద్యం ఇస్తేనే దిగుతానంటూ హల్చల్ చేశాడు. సిబ్బంది 3 గంటలు శ్రమించి కిందికి దించడంతో పోలీసులు అరెస్టు చేశారు. అతడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు.