SRPT: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చివ్వెంల పోలీసులు ఖమ్మం జాతీయ రహదారి వెంట వట్టి ఖమ్మంపాడు స్టేజి, ఐలాపురం స్టేజీల వద్ద రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు రోడ్డు భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై పోలీసులు అవగాహన కల్పించారు.