AP: గుంటూరులో ఇవాళ మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. అన్నమయ్య కీర్తనలు, సహస్ర గళార్చనల మధ్య సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నర్సింహ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కానుంది. 60 విద్యాసంస్థల నుంచి 25 వేల మంది విద్యార్థులు ఈ తెలుగు మహాసభలను సందర్శించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.