NZB: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ సూచించారు. రుద్రూర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్నప్రసన, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులు అంగన్వాడీ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఉప సర్పంచ్ నిస్సార్, ICDS సూపర్ వైజర్ శ్రీలత ఉన్నారు.