E.G: అనధికార నిర్మాణాలపై నగరపాలక సంస్థ అధికారులు మరోసారి కొరడా ఝులిపించారు. ఏవీ అప్పారావు రోడ్డులోని రామాలయ జంక్షన్ సమీపంలో నిబంధనలు పాటించని ఓ భవనంలోని నాల్గవ అంతస్తును శుక్రవారం టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం అవకాశాన్ని వినియోగించుకోని పక్షంలో భవనాలను కూల్చివేస్తామన్నారు.