ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజాబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బొకేలు ఎవరూ తీసుకురావద్దని, కేవలం విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకురావాలని కలెక్టర్ ముందుగా సూచించారు. దీంతో అధికారులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. పెద్ద మొత్తంలో వచ్చిన పుస్తకాలను త్వరలో వారు విద్యార్థులకు అందించనున్నారు.