కృష్ణా: బాపులపాడు(మం) పెరికిడిలో నక్క పవన్‌కు చెందిన గేదెల పాకలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 4 దూడలు, 2 పెద్ద ఆవులు కాలిపోయి మృతి చెందాయి. స్థానికులు హనుమాన్ జంక్షన్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్రంగా నష్టపోయామన్నారు.