NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.Ed, B.P.Ed 1, 3వ సెమిస్టర్ ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుంచి 29 వరకు జరగనుండగా 3వ సెమిస్టర్ 16 నుంచి 24 వరకు జరగనున్నాయి. అటు B.P.Ed 1, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్నాయి.