KMM: నేలకొండపల్లి మండలం సింగిరెడ్డిపాలెం బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు గాను ప్రస్తుతం 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు జనవరి 21 లోపు గురుకుల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.