KNR: పెళ్లి కావడం లేదని యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలంలో చోటు చేసుకుంది. SI క్రాంతి కుమార్ ప్రకారం.. భోగంపాడుకి చెందిన రత్న నేతాజీ(24) పెళ్లి కావడం లేదనే బాధతో డిసెంబర్ 30న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు HZB ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వరంగల్ MGMకి పంపాగా నిన్న మృతి చెందినట్లు తెలిపారు.