SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ – మూడపల్లి గ్రామాల మధ్య కల్వర్టుపై గుర్తుతెలియని వ్యక్తులు ఒరిజినల్ ఆధార్ కార్డులను వదిలి వెళ్లడం చర్చనీయ అంశంగా మారింది. ఆధార్ కార్డులను ప్రధాన రహదారిలో కల్వర్టు గోడపై వదిలి వెళ్లారు. చాలా రోజులుగా ఇవి అక్కడే పడి ఉన్నా, ఎవరూ తీసుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.