HYD: వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ సూచించారు. ఆర్టీసీ మియాపూర్ -2 డిపో ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాన్ని డిపో మేనేజర్ వెంకటేశంగౌడ్, సిబ్బందితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సెల్ఫోన్, మద్యం తాగి వాహనాలు నడపకూడదన్నారు.