TG: అసెంబ్లీలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కృష్ణా జలాల అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుండగా, మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో యథావిధిగా ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. టీజీపీఎస్సీ, పంచాయతీ రాజ్ బిల్లులను సభలో, ప్రైవేట్ వర్సిటీల బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్నారు.