KMM: రబీ సీజన్ 2025-26లో జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.