HYD: షూటింగ్ రేంజ్‌లను ఆధునీకరించి మరింత అభివృద్ధి చేస్తే తెలంగాణ షూటర్లు విజయాలు సాధించే అవకాశం పెరుగుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఏటీజీ షూటింగ్ రేంజ్‌ను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ శిక్షణ పొందుతున్న షూటర్లతో మాట్లాడారు.