MDCL: అల్వాల్‌లోని మా సంతోషి కాలనీ ఫేజ్-1, లక్ష్మీ ఎన్క్లేవ్ ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ పాదయాత్ర చేపట్టారు. అధికారులతో కలిసి ఆయన యూజీడీ, రోడ్డు పనులను పరిశీలించారు. మా సంతోషి కాలనీలో పనులు వేగంగా జరుగుతుండగా, లక్ష్మీ ఎన్‌క్లేవ్‌లో పనులకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.