BDK: ములకలపల్లి (M) చలమ్మనగర్ గ్రామంలో మంగమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే బంధువులు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. EMT రాజేశ్వరి, పైలట్ సాయికిరణ్ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో వారు అంబులెన్స్‌లోనే మంగమ్మకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. అనంతరం వారిని బూర్గంపాడు CHCలో చేర్పించారు.