Ammonia Gas: హైదరాబాద్ నడిబొడ్డున గల ఫతేనగర్‌లో అమ్మోనియో గ్యాస్ (Ammonia Gas) లీకయ్యింది. పైప్ లైన్ రోడ్డు చివరలో చెత్తకుప్పలో గ్యాస్ కట్ చేసేందుకు ఉపయోగించే రెండు అమ్మోనియా గ్యాస్ (Ammonia Gas) సిలిండర్లు ఉన్నాయి. అవీ చాలా కాల నుంచి అక్కడే పడి ఉన్నాయి. అటుగా వచ్చిన దొంగ (thief).. సిలిండర్లకు ఉన్న ఇత్తడి వాల్వ్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. రాడ్డుతో కొట్టి తీసే ప్రయత్నం చేయగా.. సిలిండర్ నుంచి అమ్మోనియా గ్యాస్ (Ammonia Gas) లీకయ్యింది.
గ్యాస్ (gas) లీకవడంతో ఆ దొంగ భయపడి.. అక్కడి నుంచి పారిపోయాడు. 10 నుంచి 12 మీటర్లు ఎత్తులో గ్యాస్ చిమ్మింది. గ్యాస్ లీక్ కావడంతో సమీపంలో ఉన్న కార్మికులు ఇబ్బంది పడ్డారు. కంపెనీలో పనిచేసే 10 మంది కార్మికులు, ఐదుగురు కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో పెద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉంది. గ్యాస్ లీకై అగ్గి అంటుకోలేదని స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ లీకయిన విషయం గురించి బస్తీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని వారు అంటున్నారు.